విధులకు గైర్హాజరు.. 53 మందికి షోకాజ్ నోటీసులు
కామారెడ్డి జిల్లాలో జరగనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులకు గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధులకు కేటాయించిన 53 మంది అధికారులు బుధవారం డ్యూటీలో రిపోర్టు చేయలేదు. దీంతో ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసినందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు DEO రాజు పేర్కొన్నారు.