'మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేయడం ప్రభుత్వానికి తగదు'

JN: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్న మాజీ సర్పంచుల పట్ల ప్రభుత్వం కట్టిన వైఖరిని అవలంబించడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. నేడు జనగామ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో మాజీ సర్పంచ్ లను పోలీసుల అరెస్టు చేయడం సరైంది కాదని ఎద్దేవా చేశారు.