విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కన్నుమూత

విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కన్నుమూత

సత్యసాయి: లేపాక్షి మండల కేంద్రంలో గత ఐదు సంవత్సరాలుగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేసిన రఘు, ఇటీవల బదిలీపై చిలమత్తూరు మండల రైతు భరోసా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆయన గుండెపోటుతో కొన్ని గంటల క్రితం కన్నుమూశారు. రఘు మృతికి సహోద్యోగులు, రైతులు సంతాపం తెలియజేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం అందించాలని కోరుకున్నారు.