'రాష్ట్ర పురస్కారాలకై దరఖాస్తుల ఆహ్వానం'
WNP: దివ్యాంగులు సాధికారత అవార్డు 2025కు గాను అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సాధికారత శాఖ సంచాలకులు సుధారాణి తెలిపారు. ప్రతి ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని ఇచ్చే ఈ అవార్డు కోసం అభ్యర్థులు www.wdsc.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.