సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ
CTR: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ఎమ్మెల్యే మురళీమోహన్ సూచించారు. తవణం పల్లె ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై ఫిర్యాదులు అందాయి. వీటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.