'బాపట్ల జిల్లాను అన్ని రంగాల్లో బలపరచాలి'

BPT: బాపట్ల జిల్లాను అన్ని రంగాల్లో బలపరచడానికి చర్యలు తీసుకోవాలని బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. ఆదివారం బాపట్ల వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..జిల్లా కేంద్రం అభివృద్ధిలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ నిర్లక్ష్యంతో అభివృద్ధి వెనక పడిపోతుందన్నారు. జిల్లా కేంద్రానికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చీరాలకు తరలిపోవడం విడ్డూరమన్నారు.