మూడో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
PDPL: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకోగా మంథని డిపో ఎదుట "హమారే మంగే నై దియేతో బస్ క పయ్య నై చాలేగా" అని నినాదాలు చేస్తూ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ కార్మికులు నిరసన తెలిపారు.