1,045 ఎకరాల భూమిని రక్షించాం: భట్టి

1,045 ఎకరాల భూమిని రక్షించాం: భట్టి

TG: దేశంలో అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌కు పేరుందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో పేర్కొన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఉందన్నారు. అప్పులపై బ్యాంకులతో చర్చించి వడ్డీని 7.95 శాతానికి తగ్గించామన్నారు. నగరంలో 1045 ఎకరాల భూమిని ఆక్రమణల నుంచి రక్షించామని తెలిపారు. ఫేజ్ 2,3తో మెట్రోను పాతబస్తీ, శంషాబాద్‌కు నిర్మిస్తామన్నారు.