3కోట్లతో మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్
NRPT: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సత్యావార్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్‌కు ఆయన భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలపరచడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సాధికారతతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సోలార్ ప్లాంట్ పూర్తైతే సంవత్సరానికి సుమారు రూ.26 లక్షలు మహిళా సంఘాలకు ఆదాయం వస్తుందని వెల్లడించారు.