మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి
NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వివిధ కళాశాలల విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్స్, స్కాలర్‌షిప్‌ల కోసం ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఎ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. లేనియేడల ఉద్యమం చేపడుతామని హొచ్చరించారు.