ప్రకాష్ రెడ్డి అసమర్థుడు: ఎమ్మెల్యే పరిటాల
ATP: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేని అసమర్థుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ఆత్మకూరు మండలం పి.కొత్తపల్లి పర్యటనలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రోడ్డు పనులను అడ్డుకున్నారని ఆరోపించారు. తిరిగి తాము అధికారంలోకి వచ్చాకనే పనులు పూర్తి చేశామని తెలిపారు.