ఇంటిపోరులో పిన్ని పిన కొడుకు మధ్య పోటీ
SRD: రాజకీయంలో ఇంటి పోరు నేపథ్యంలో సిర్గాపూర్ మండలం ఉజులంపాడ్‌లో సమస్య ఎదురయింది. మొన్నటి వరకు ఒకటిగా ఉన్న వీరు సర్పంచ్‌గా పోటీ చేసేందుకు నువ్వా.. నేనా.. అంటూ విడిపోయారు. స్థానిక మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి కుమారుడు శశికాంత్ రెడ్డి, ఆయన చిన్నమ్మ పద్మజ ప్రత్యర్థులయ్యారు. శశికాంత్ రెడ్డికి కాంగ్రెస్ బలపరచగా, పిన్నికి BRS పార్టీ మద్దతు పలుకుతోంది.