తీజ్ వేడుకల్లో పాల్గొన్న కవిత

RR: తీజ్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని MLC కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కర్మన్ ఘాట్‌లో బంజార తీజ్ పండుగలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు. 9 రోజుల పాటు ఏవిధంగానైతే బతుకమ్మ పండుగను జరుపుకుంటామో.. అలాగే తొమ్మిది రోజుల పాటు తీజ్ పండుగను గిరిజన యువతులు జరుపుతారని తెలిపారు.