ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు

ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు

SRD: న్యాల్కల్ మండలం రాజవరంలోని స్వయంభు వరసిద్ధి వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వరసిద్ధి గణపతికి అర్చకులు పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. గరికలతో మహా పూజ కార్యక్రమాన్ని చేశారు. గణపతికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.