VIDEO: బాలుడిపై కుక్క దాడి.. హీరోగా మారిన తాత
HYD: ఓ బాలుడిపై వీధికుక్క దాడి చేసిన ఘటన యూసఫ్‌గూడ డివిజన్‌లో చోటు చేసుకుంది. లక్ష్మీ నరసింహనగర్‌కు చెందిన రెండేళ్ల మన్వీత్ నందన్ అనే బాలుడిపై కుక్క దాడి చేసింది. వెంటనే స్పందించిన ఓ వృద్ధుడు కర్రతో కుక్కను తరిమి కొట్టాడు. ఈ ఘటన సంబంధించిన సీసీ టీవీలో రికార్డ్ అయింది.