కుంభమేళాను తలపించేలా రజతోత్సవ సభ: మాజీ ఎమ్మెల్యే

NLG: పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 27న జరగనున్న వరంగల్ రజోత్సవ సభ కుంభమేళాను తలపించేలా ఉంటుందన్నారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా తరలివస్తారని, ప్రజలను సభకు తరలించేందుకు భారీగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.