12వ వార్డులో మిషన్ భగీరథ నీళ్లు రాక అవస్థలు
NRPT: గుండుమాల్ మండల కేంద్రంలోని 12వ వార్డులో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ పనులకు వెళ్లాల్సిన సమయంలో నీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.