VIDEO: 'రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి'

VIDEO: 'రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి'

ADB: జిల్లా రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బోథ్ MLA అనిల్ జాదవ్ కోరారు. బుధవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఆయన మాట్లాడారు. వరి పంటకు బోనస్ రూ. 500 ఇచ్చినట్టు పత్తి, సోయాబీన్, శనగ, కందులకు సైతం అందజేయాలని విన్నవించారు. వర్షాధార పంటలను పండిస్తున్న జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.