అంగన్వాడీల్లో అక్రమాలకు తావులేదు: రామగోపాల్ రెడ్డి

అంగన్వాడీల్లో అక్రమాలకు తావులేదు: రామగోపాల్ రెడ్డి

KDP: పులివెందులలోని ఇస్లాంపురం, జెండా మాన్ వీధి అంగన్వాడీ కేంద్రాలను శనివారం MLC రామగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందజేసే పౌష్టికాహార పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని, ఆహార నాణ్యతలో రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు.