నేడు రాష్ట్రంలో నితిన్ గడ్కరీ పర్యటన

TG: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి పలు జాతీయ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉ.10.15 గంటలకు కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో నిర్మించిన ఐదు జాతీయ రహదారులను ప్రారంభిస్తారు. తర్వాత BHEL ఫ్లైఓవర్, అంబర్ పేట్ ఫ్లైఓవర్‌ను కూడా ప్రారంభించనున్నారు.