నవోదయకు విద్యార్థులు ఎంపిక

నవోదయ విద్యా ప్రవేశ పరీక్షలో మధుపాడలోని సాయి గౌతమ్ పాఠశాలకు చెందిన దాసరి మనస్వని, కోట మణికంఠలు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎస్.ఎస్.నాయుడు విద్యార్థులను అభినందించారు. అలాగే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.