VIDEO: వీధి కుక్కల దాడిలో... మహిళకు తీవ్ర గాయాలు

SRPT: తుంగతుర్తిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఐసీడీఎస్ కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ సిబ్బందిపై వీధి కుక్కలు దాడి చేయడంతో శుక్రవారం తీవ్ర గాయాలయ్యాయి. జెండా పనిలో భాగంగా ఎదురుగా ఉన్న ఇసుకను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆమెపై పది వీధి కుక్కలు ముప్పేట దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను తోటి సిబ్బంది, స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.