'జీవీఎంసి సిబ్బందికి ఘనంగా సత్కరణ'

VSP: విజయవాడలో వరదల సమయంలో విశాఖపట్నం నుండి జీవీఎంసి సిబ్బంది వెళ్ళి శానిటేషన్, రక్షణ సేవలు అందించిన విషయం తెలిసిందే. అయితే 33వ వార్డు నుండి వెళ్ళిన 13 మంది జీవీఎంసి సిబ్బందికి ఆ వార్డ్ జనసేన కార్పొరేటర్ మరియు జీవీఎంసి ఫ్లోర్ లీడర్ అయిన వసంతలక్ష్మి గోపికృష్ణ దంపతులు ఘనంగా సత్కరించి వారికి నిత్యావసర సరుకులు అందించారు.