‘గర్భాశయ క్యాన్సర్ రాకుండా HPV వ్యాక్సిన్ కాపాడుతుంది’

‘గర్భాశయ క్యాన్సర్ రాకుండా HPV వ్యాక్సిన్ కాపాడుతుంది’

AKP: గర్భాశయ క్యాన్సర్ సోకకుండా HPV వ్యాక్సిన్ కాపాడుతుందని రాంబిల్లి మండలం దిమిలి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ తెలిపారు. సోమవారం దిమిలి పీహెచ్‌సీలో బాలికలకు వ్యాక్సిన్ వేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 90 రోజులు పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.