పుట్టపర్తిలో ఆకట్టుకున్న నాటక ప్రదర్శన
సత్యసాయి: తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో తమిళనాడు సాయి యువత 'త్యాగతిన్ శిఖరంగాళ్' పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. సంఘం కాలం నాటి పారి, పేగన్ వంటి ఏడుగురు గొప్ప దాతల త్యాగనిరతిని ఈ నాటకంలో అద్భుతంగా ఆవిష్కరించారు. మూగజీవాలు, ప్రకృతి పట్ల వారు చూపిన కరుణను కళ్ళకు కట్టినట్లు చూపారు.