రోడ్డుపైకి కరెంటు స్తంభాలు.. ప్రమాదాలకు ఆహ్వానం

రోడ్డుపైకి కరెంటు స్తంభాలు.. ప్రమాదాలకు ఆహ్వానం

BPT: సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లి-ఈటీ రోడ్డులో విద్యుత్ స్తంభాల ఏర్పాటు అస్తవ్యస్తంగా సాగుతోంది. నిబంధనల ప్రకారం పాత లైన్ వెనుక స్తంభాలు పాతాల్సి ఉండగా, రోడ్డు మార్గంలోకి వచ్చేలా వేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. దీనివల్ల వర్షాకాలంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు కాంతారావు పేర్కొన్నారు.