పద్మాక్షి అమ్మవారికి ప్రత్యేక పుజలు
HNK: నగరంలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా భక్తులకు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లావారుజామునే ఆలయ ప్రధాన ఆర్చకులు ఆమ్మవారికి అభిషేకం చేసి, అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పర్వదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.