బెంజ్ సర్కిల్ సిగ్నల్ వద్ద వాహనదారుల ఇక్కట్లు

బెంజ్ సర్కిల్ సిగ్నల్ వద్ద వాహనదారుల ఇక్కట్లు

కృష్ణా: విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ పడితే అర కిలోమీటర్ పైగా ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు తెలిపారు. నేడు క్యాబినెట్ భేటీ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు విజయవాడ నగరం మీదుగా అమరావతికి వెళుతుండగా పోలీసు వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ద్విచక్ర వాహనదారులు వాపోయారు.