బాలికపై లైంగిక దాడికి యత్నం.. పోక్సో కేసు నమోదు

బాలికపై లైంగిక దాడికి యత్నం.. పోక్సో కేసు నమోదు

KDP: కలసపాడు మండలంలో 15 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన శ్రీను అనే 40 ఏళ్ల వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే శుక్రవారం తల్లితో కలసపాడు వచ్చిన విద్యార్థిని, సొంతూరికి వెళ్లేందుకు శ్రీను ఇచ్చిన లిఫ్ట్‌లో వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో శనివారం తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిమోతి తెలిపారు.