ఇరాన్ వ్యాఖ్యలను ఖండించిన జీసీసీ
యూఏఈలోని మూడు దీవులను తమ భూభాగానికి చెందినవిగా ఇరాన్ పేర్కొనడంపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(GCC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని మండిపడింది. ఇటువంటి ప్రకటనలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తాయని పేర్కొంది. ఆ దేశంతో జీసీసీ చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తింది.