తెనాలిలో అగ్నిప్రమాదం
GNTR: తెనాలి గంగానమ్మపేటలోని బట్టావారి వీధిలో గల ఒక నాలుగు అంతస్తుల భవనంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. 2, 3, 4 అంతస్తులకు మంటలు వ్యాపించడంతో పాటు ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.