'ఆలమూరు నుంచి ఆళ్లగడ్డకు బస్సు నడపండి'
NDL: ఆలమూరు నుండి ఆళ్లగడ్డకు వెళ్లే విద్యార్థుల కోసం బస్సు నడపాలని విద్యార్థి సంఘం నాయకులు సమీర్, విగ్నేష్,కలిసి ఇవాళ డిపో మేనేజర్‌ను కోరారు. ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు ఆలమూరు నుంచి ఆళ్లగడ్డకు పలు వాహనాలలో పాఠశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల కోసం వెంటనే బస్సును నడపాలని కోరుతూ వారు డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు.