ఆకట్టుకున్న సిలువ యాత్ర
కాకినాడ: గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా సామర్లకోట ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన యేసు క్రీస్తు సిలువ యాత్ర ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. రెండువేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు సిలువకు అప్పగింపబడగా ఆయన సిలువ యాత్రను కొనసాగించిన దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. చర్చి ఫాదర్ పీటర్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తుగా శేఖర్, వేషధారణలతో ఈ ప్రదర్శన చేపట్టారు.