'అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తాం'
VZM: అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బుధవారం తెర్లాం మండలం చిన్నయ్యపేటలో పీఎం అవాస్ యోజన ఇళ్ల గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 1057 ఇళ్లను మంజూరు చేశామని, అలాగే ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.