VIDEO: రైల్వే స్టేషన్‌లో దారుణం.. వ్యక్తి గొంతు కోసి హత్య
గుంటూరులోని పెదకాకాని రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఒక దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే స్టేషన్ ఆవరణలో రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.