ఆర్టీసీ బస్సులకు విజయవాడ సిటీ రూట్ ఇదే..!

ఆర్టీసీ బస్సులకు విజయవాడ సిటీ రూట్ ఇదే..!

కృష్ణా: విజయవాడలో నేడు తిరంగా రన్ కోసం సాయంత్రం 4 - 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించారు. గన్నవరం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా PNBSకు వెళతాయి. గుడివాడ మచిలీపట్నం నుంచి వచ్చేవి తాడిగడప 100 అడుగుల రోడ్డు నుంచి ఎనికెపాడు రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు రోడ్డు మీదగా PNBS వెళతాయి. మళ్లీ తిరిగి ఇదే మార్గంలో RTC బస్సులు వెళ్లాలి.