క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

NDL: కోవెలకుంట్లలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రూ.4 లక్షల నగదు, 7 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ పాటు, ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.