నందవరంలో బసవేశ్వర విగ్రహానికి ఊరేగింపు

కర్నూలు: మండల కేంద్రమైన నందవరంలో సోమవారం సాయంత్రం విశ్వ గురువు బసవేశ్వర విగ్రహానికి పల్లకిపై మోస్తూ, శోభాయాత్ర జరిపారు. ఈ సందర్భంగా బసవేశ్వర స్వామి భక్తులు, భక్తిశ్రద్ధలతో బసవ పురాణం చదువుతూ.. గ్రామ పురవీధుల గుండా ఊ రేగింపు చేపట్టారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బసవేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.