'బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి'
శ్రీకాకుళం మండలం సింగుపురంలో కల్తీ బాదం పాలు తాగి 150 మంది అస్వస్థకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ యువ నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు శనివారం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. అస్వస్థతకు గురైన వారి నుంచి పలు వివరాలు సేకరించారు. తక్షణమే ప్రభుత్వం బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.