తాండూరులో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్
వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మార్నింగ్ వాక్‌కు శ్రీకారం చుట్టారు. పలువార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మంచినీటి సరఫరా చెత్త సేకరణ డ్రైనేజీ వ్యవస్థ పై ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ పై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.