పశు వైద్యశాలను సందర్శించిన జిల్లా పశు వైద్యాధికారి
SRPT: కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలను సూర్యాపేట జిల్లా పశు వైద్యాధికారి శ్రీనివాసరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాతల సహకారంతో సూర్యాపేట జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్న పశు వైద్య బ్యాంక్‌ను ఆయన పరిశీలించారు. వినూత్న పద్ధతుల్లో శస్త్రచికిత్సలు చేస్తూ మూగజీవుల ప్రాణాలు కాపాడుతున్న కోదాడ ఆసుపత్రి సేవలను ఆయన కొనియాడారు.