VIDEO: అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేసిన ఆదివాసీ మహిళలు
ASR: కొయ్యూరు మండలం దొడ్డవరం గ్రామంలో ఓ గిరిజనేతరుడు చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని మంగళవారం ఆదివాసీ మహిళలు కూల్చి వేశారు. గ్రామంలో కమ్యూనిటీ హాలుకు అడ్డంగా ఓ గిరిజనేతరుడు నిర్మిస్తున్న ఇల్లును నిలిపివేయాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు మహిళలు తెలిపారు. ఈ క్రమంలో నిర్మాణం కూల్చివేస్తామని నిన్న ఎంపీడీవో, ఎమ్మార్వో, పోలీసులకు తెలిపారు.