అప్రమత్తతతో రోగులను రక్షించవచ్చు

కడప: ఆస్పత్రి భవనాలలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే రోగులను సురక్షితంగా ఎలా రక్షించాలి అనే అంశంపై బద్వేల్ ఇన్ఛార్జ్ అగ్నిమాపక అధికారి ఆధ్వర్యంలో గురువారం వైద్యులకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పొగ అధికంగా వ్యాపిస్తుందని దీంతో రోగులకు శ్వాస ఆడక తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు.