డబ్బులతో ఉడాయించిన చిట్‌ఫండ్ వ్యాపారి
WGL: కాజీపేటలో నెల రోజులుగా వ్యాపారి కనిపించక పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ద్రాక్షాయిని దేవి అనే ప్రైవేట్ చిట్‌ఫండ్ సంస్థను ప్రారంభించాడు. కాజీపేట నుంచి మడికొండ వరకు ప్రైవేట్ ఉద్యోగులు, వర్తకులు, వ్యాపారుల వద్ద రోజు, వారం, నెల వారీగా రూ. కోటి వరకు డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు హనుమకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.