పుంగనూరులో ఘనంగా రామానుజన్ జయంతి వేడుకలు
CTR: పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. రామానుజన్ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మేధావి అని అన్నారు. గణిత శాస్త్రంలో ఆయన సాధించిన విజయాలు అనితర సాధ్యమైనవని, ఆయనను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు గణిత శాస్త్రంలో రాణించాలని కోరారు.