KTR అరెస్టుపై రేవంత్‌కి కిషన్ రెడ్డి కౌంటర్
TG: KTRను BJP ఎందుకు అరెస్ట్ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముందు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలుపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం విచారణపై తాము ఎన్నికల్లో హామీ ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి డిక్లరేషన్లు, 420 హామీలపై డిబేట్‌కు రావాలన్నారు. తమపై అకారణంగా ఆరోపణలు చేయడం తగదన్నారు.