జిల్లాలో భానుడి భగభగలు
KMR: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జుక్కల్లో అత్యధికంగా 39°C ఉష్ణోగ్రత నమోదు కాగా, మద్నూరు, బిచ్కుంద మండలాల్లో 38.9°Cగా నమోదైంది. వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రివేళల్లోనూ ఉక్కపోత భరించలేక ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.