గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దీర్ఘ, మధ్యశ్రేణి క్షిపణుల దాడులు చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడుల్లో బహ్రెయిన్‌లోని అమెరికా పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థ నిర్వహణ కేంద్రం ధ్వంసమైనట్లు ఐఆర్‌జీసీ తెలిపింది.