పెదబయలులో 250 మంది రక్తదానం

పెదబయలులో 250 మంది రక్తదానం

ASR: పెదబయలు ఎంపీడీవో ఆఫీసులో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. దీనిని మాతా శిశు సంక్షేమ పీడీ చిట్టపులి ఝాన్సీ భాయి ప్రారంభించగా, తహసీల్దార్ త్రినాథ్, రెడ్ క్రాస్ గంగరాజు పాల్గొన్నారు. 250 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు రక్తదానం చేశారు. దాతలను, అధికారులను రెడ్ క్రాస్ సొసైటీ ప్రత్యేకంగా అభినందించింది.