విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

KMM: మధిర మండలం మల్లారం గ్రామంలో ఆదివారం ఉదయం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన నల్లమల శేఖర్ అనే రైతు ఎద్దు విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలను వదిలింది. మృతి చెందిన ఎద్దు విలువ రూ.లక్ష వరకు ఉంటుందని తెలిపాడు. ప్రభుత్వం అదుకోవాలని రైతు కోరాడు.